Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాదాపూర్ పీయస్ పరిధిలోని మస్తాన్ నగర్ లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. మే 7వ తేదీ ఆదివారం ఉదయం మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి నేతృత్వంలో అడిషనల్ డీసీపీ, ఒక ఏసీపీ, 11 సెర్చ్ పార్టీలు, దాదాపు 150 మంది పోలీసు సిబ్బందితో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నలుగురు పాత నేరస్తులను గుర్తించగా, సరైన పత్రాలు లేని నాలుగు వెహికిల్స్ సీజ్ చేశారు. రెండు బెల్టు షాపులు గుర్తించిన పోలీసులు 400 కాటన్ల మద్యం బాటిళ్లు పట్టుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన డీసీపీ శిల్పవల్లి.. మస్తాన్ నగర్ లో 11 సెర్చ్ పార్టీలు, 5 కటాఫ్ పార్టీలతో తనిఖీలు చేశామన్నారు. అనుమానితులను, సరైన పత్రాలు లేని వాహనాలను, షాపులలో సెర్చ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు రెండు బెల్టు షాపులు, అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న ఓ షాపును, క్రాకర్స్ నిల్వ ఉంచిన మరో షాపును గుర్తించాని వెల్లడించారు. ఈ తనిఖీలో 400 కాటన్స్ మద్యం బాటిళ్ళు సీజ్ చేశామని.. నలుగురు పాత నేరస్తులను గుర్తించి వారి పరిస్థితి తెలుసుకున్నామని పేర్కొన్నారు డీసీపీ శిల్పవల్లి.