Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబాబాద్
రాష్ట్రంలో అకాల వర్షాలు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా, మరి కొందరికి లెక్కకు మంచిన ఆర్థిక నష్టాన్ని కలగజేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఏప్రిల్ 6న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో గాజులగట్టు గ్రామంలో పిడుగుపాటుకు గురై 18 గొర్రెలు మృతి చెందాయి. మరో 12 గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. కొత్తగూడ మండలంలోనూ ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. పొగుళ్లపల్లి అంగన్వాడీ కేంద్రం భవనంపై చెట్టు విరిగిపడింది. ఆ సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.