Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉత్తర ప్రదేశ్
ఉత్తరప్రదేశ్ లో జలౌన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా..మరో 17 మందికి తీవ్ర గాయలయ్యాయి.ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. జలౌన్ జిల్లాలోని రాంపురలో పెళ్లి తంతు పూర్తవ్వగానే బస్సులో మైల గ్రామానికి బయల్దేరారు. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మధుఘర్ పీఎస్ పరిధిలోని గోపాల్ పురా సమీపంలో మే 6 వ తేది అర్థరాత్రిగుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు గాయపడిన వారిని మధోగడ్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురు మృతి చెందారని డాక్టర్లు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారిని ఓరై మెడికల్ కాలేజీకి తరలించారు.
జైలౌన్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.