Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి: మణిపుర్లో ఘర్షణలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న ఏపీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమను స్వస్థలాలకు చేర్చాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎన్ఐటీ క్యాంపస్లో సుమారు 150 మంది తెలుగు విద్యార్థులు ఉండగా.. వారిలో 70 మంది వరకు ఏపీకి చెందిన వారు ఉన్నట్లు అక్కడి విద్యార్థులు తెలిపారు. గత మూడు రోజులుగా పేలుళ్లు జరుగుతున్నాయని.. ఆహార పానీయాలకు ఇబ్బంది పడుతున్నామని మణిపుర్ ఎన్ఐటీ విద్యార్థిని యజ్ఞశ్రీ తెలిపింది. తామంతా భయాందోళనతో గడుపుతున్నట్లు ఆమె వెల్లడించింది. తాము వచ్చేందుకు ప్రస్తుతం విమానాలు కూడా లేవని తెలిపింది. ఏపీ విద్యార్థులను స్వస్థలాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేయాలని కోరింది.