Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గతకొంత కాలం నుంచి సందీప్ సినీ కెరీర్ ఒక అడుగు ముందుకు వేస్తుంటే నాలుగు అడుగులు వెనక్కి పడుతుంది. కెరీర్ బిగెనింగ్ నుంచి విభిన్న సినిమాలు చేస్తున్నా.. కమర్షియల్‌గా హిట్లు సాధించలేకపోతున్నాడు. ఎంతో కష్టపడి చేసిన మైఖేల్ సైతం తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. ప్రస్తుతం సందీప్ ఆశలన్నీ ఊరు పేరు భైరవకోన సినిమాపైనే ఉన్నాయి. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై ఎక్కడలేని హైప్ తీసుకొచ్చాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌తోనే మేకర్స్ సినిమా కాన్సెప్ట్‌పై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. శ్రీ కృష్ణ దేవరాయ కాలంలో చెలామణిలో ఉన్న గరుడపురాణంకు ఇప్పటి గరుడపురాణంకు నాలుగు పేజీలు తగ్గాయని, ఆ నాలుగు పేజీలే భైరవ కోన అంటూ టీజర్‌తోనే సినిమా ప్లాట్‌ను చెప్పేశారు. మరీ ఆ మాయమైన పేజీల్లో ఏమి ఉన్నాయి. అసలు భైరవకొనలో ఏం జరుగుతుంది అనే అంశాలతో సినిమాపై మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు. టీజర్లో ఈ ఊరిలోకి రావడమే కానీ, బయటకు పోవడం ఉండదంటూ వచ్చిన డైలాగ్ విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. దర్శకుడు విఐ ఆనంద్ చాలా కాలం తర్వాత తనకు ఎంతో ఇష్టమైన సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో సినిమా చేస్తుండటంతో అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.
ముఖ్యంగా టీజర్లో శేఖర్ చంద్ర బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవల్లో ఉంది. టీజర్‌ను గమనిస్తే రాజ్ తోట సినిమాటోగ్రఫి హైలేట్‌గా కనిపిస్తుంది. నైట్ షాట్స్ అద్భుతంగా తీసినట్లు కనిపిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్‌కు జోడీగా కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైనమెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.