Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ చరిత్రలో అన్నదమ్ములు.. వేర్వేరు జట్లకు, ఒకే జట్టుకు ఆడిన సందర్భాలు ఉన్నాయి. కానీ, తొలిసారి ప్రత్యర్థి జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న సోదరులుగా మాత్రం హర్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య రికార్డు సృష్టించబోతున్నారు. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ నాయకత్వం వహిస్తుండగా.. తాజాగా కేఎల్ రాహుల్ గైర్హాజరీతో కృనాల్ పాండ్య లక్నో జట్టు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వీరి మధ్య పోరు ఎలా ఉండనుందోననే ఆసక్తిగా మారింది.