Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు షోకాజ్ నోటీసు జారీ చేసింది బీజేపీ. ప్రాథమిక సభ్యత్వం నుంచి ఎందుకు తప్పించకూడదంటూ షోకాజ్ నోటీసులో పేర్కొంది బీజేపీ ఏపీ క్రమశిక్షణ సంఘం. ఇవాళ సాయంత్రంలోగా షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది బీజేపీ ఏపీ క్రమశిక్షణ సంఘం. పొత్తులపై మీడియాతో ఇష్టానుసారంగా మాట్లాడారనే అభియోగంపై షోకాజ్ నోటీసు జారీ చేసింది. పొత్తులపై వివిధ సందర్భాల్లో విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్లని సీరియస్సుగా తీసుకుంది బీజేపీ హైకమాండ్. బీజేపీ ఢిల్లీ పెద్దల సూచనలతో షోకాజ్ నోటీసు జారీ చేసింది బీజేపీ ఏపీ క్రమశిక్షణ సంఘం.