Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్-2023లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఇక ప్రోటీస్ స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్‌కు ఎట్టకేలకు జట్టులో చోటు దక్కింది. నవీన్ ఉల్హక్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. అదే విధంగా స్వప్నిల్ సింగ్‌కు కూడా తొలి సారి ఛాన్స్ దక్కింది. మరోవైపు గుజరాత్ జట్టు కూడా ఒకే ఒక మార్పు చేసింది. లిటిల్ స్థానంలో జోషఫ్ వచ్చాడు.