Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బెంగళూరు: ఎన్నికల ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తపై బీజేపీ నేత దాడి చేశాడు. దీంతో ఆ పార్టీ అభ్యర్థిని ఫేస్బుక్ లైవ్లో దీనిని ప్రసారం చేసింది. ఈ సంఘటనపై స్పందించిన పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. కాంగ్రెస్ కార్యకర్తపై దాడి చేసిన బీజేపీ నేతపై కేసు నమోదు చేశారు. బీజేపీ పాలిత కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 10న ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజరాజేశ్వరి నగర్ (ఆర్ఆర్ నగర్) నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిని కుసుమ తరపున ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేశారు. కాగా, యశ్వంతపూర్ సమీపంలో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తపై బీజేపీ మాజీ కార్పొరేటర్ జీకే వెంకటేష్ దాడి చేశాడు. కాంగ్రెస్ అభ్యర్థిని కుసుమ ఈ దాడిని ఫేస్బుక్ ద్వారా లైవ్లో ప్రసారం చేశారు. దీంతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సంఘటనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. కాంగ్రెస్ కార్యకర్తపై దాడి చేసిన బీజేపీ నేత వెంకటేష్పై కేసు నమోదు చేశారు.