Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందల్ వాయి గ్రామంలో ఉద్రిక్తత..
- మజీద్ ముందు మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన..
- ప్రేమికుడిని అదుపులోకి తీసుకున్నా పోలీసులు..
- భారీగా మోహరించిన పోలసులు..
నవతెలంగాణ డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామానికి చెందిన యువతి ప్రేమ విఫలం కావడం తో తట్టుకోలేక ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడింది. దీంతో గ్రామంలో తివ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. మృతదేహం తో ఇందల్ వాయి గ్రామంలోని మజీద్ ముందు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గ్రామస్తులు తేలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.ఇందల్ వాయి గ్రామానికి చెందిన గుండాల అష్మిత(18) అదే గ్రామానికి చెందిన సమీర్ తో గతం నుండి ప్రేమ వ్యవహారం కోనసాగుతుందని, శనివారం అష్మిత సమీర్ ఇంటికి వేళ్ళిందని, సమీర్ కుటుంబా సభ్యులతో పెళ్లి విషయం మాట్లాడిందని,కాని ఇద్దరి కులాలు వేరు కావడంతో సమీర్ కుటుంబా సభ్యులు పెళ్లి కి వ్యతిరేకించి తిరిగి ఇంటికి పంపించి వేసారని స్థానికులు తెలిపారు.గత్యంతరం లేక యువతి మనస్థాపం చెంది పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టింది.గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రి తరలించాగ చికిత్స పోందుతు అష్మిత శనివారం రాత్రి మృతి చెందింది. మృతురాలు అష్మిత తాత ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మేరకు కేసు నమోదు చేశారు.ఉదయం ఈ వార్త గ్రామంలో వాహనంలో వ్యాపించడంతో ప్రేమికుడు సమీర్ కుటుంబం ఇంటికి తాళం వేసుకొని పరారయ్యారు.అగ్రాహించిన గ్రామస్తులు గ్రామంలోని మసీద్ ఎదుట శవం తో ఆందోళన చేపట్టారు.నిందితుడు వచ్చి బాధిత కుటుంబానికి కచ్చితమైన హామీ ఇచ్చే వరకు అంత్యక్రయలు నిర్వహించేది లేదని గ్రామస్థులు పేర్కొన్నారు.దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. యువతీ మృతికి కారణం అయిన యువకుడు దొరికే వరకు మృతదేహన్ని తీసుకుపోయే పరిస్థితి లేదని గ్రామస్థులు బిస్మించూ కొని కూర్చున్నారు దీంతో ఎస్ ఐ బి నరేష్ అధ్వర్యంలో పోలిసులు భారీగా చేరుకున్నారు.డిచ్ పల్లి సిఐ కృష్ణ, ఎస్ఐ కచ్చాకాయల గణేష్ తో పాటు వివిధ పోలీస్ స్టేషన్లో లకు చెందిన సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు.ఒక దశలో మజీద్ కమిటీ గేట్ లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.అక్కడే మృతురాలి బంధువులు కుటుంబీకులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎప్పుడు ఎం జరుగుతుందో ఎవరికి అంతు చిక్కడం లేని పరిస్థితి నేలకోంది. నిందితుడు సమీర్ ను తక్షణమే అరెస్టు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. యువతిని పెళ్లాడేందుకు ఒప్పుకొని ఆనంతరం ఆమెను మోసం చేయడం వల్లే యువతి మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు.ఈ మేరకు మృతురాలి తాత రాజయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ నరేష్ తెలిపారు. మృతికి కారణమైన సమీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని తేల్పడంతో గ్రామస్తులు శాంతించారు.ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలిస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.