Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మలప్పురం: కేరళలోని మలప్పురం జిల్లాలో ఆదివారం సాయంత్రం 7.00 గంటల ప్రాంతంలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. తనూర్ పట్టణ తువల్తీరం బీచ్ సమీపంలో 30 మంది ప్రయాణికులతో వెళుతున్న హౌస్‌బోట్ బోల్తాపడి మునిగిపోవడంతో 20 మంది మృతిచెందారు. మృతుల్లో అయిదుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో వీరంతా విహారయాత్రకు వచ్చి ప్రమాదంలో పడ్డారు. కేరళ క్రీడల మంత్రి వి.అబ్దు రహిమాన్, పర్యాటకశాఖ మంత్రి పి.ఎ.మహమ్మద్ రియాజ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ‘‘మృతుల్లో చాలామంది పడవ అడుగుభాగంలో చిక్కుకుపోయారు. పడవ బోల్తాపడటానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’’ అని మంత్రి అబ్దు రహిమాన్ తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహాయక చర్యల సమన్వయానికి తగు చర్యలు తీసుకొనేలా మలప్పురం జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.