Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - లిమా: దక్షిణ అమెరికా దేశం పెరూలోని ఓ బంగారు గనిలో సంభవించిన అగ్నిప్రమాదంలో 27 మంది మృతి చెందారు. ఇద్దరిని మాత్రమే రక్షించగలిగామని అధికారులు తెలిపారు. అరెక్విపా ప్రాంతంలోని ఎస్పెరాంజా గనిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఈ ఘటన చోటుచేసుకుంది. గనిలో సుమారు 100 మీటర్ల లోతులో సిబ్బంది పనిచేస్తున్న చోట మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనులు పెరూలో ఉన్నాయి. ఏటా వీటి నుంచి 100 టన్నుల బంగారాన్ని వెలికితీస్తుంటుంది. ప్రపంచంలోని బంగారం ఉత్పత్తిలో ఇది 4%.