Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - టెక్సాస్ : వేగంగా వచ్చిన ఓ కారు బస్టాప్‌లో వేచి ఉన్న వారిపైనుంచి వెళ్లిన ఘటన టెక్సాస్ నగరంలోని బ్రౌన్స్‌విల్లేలో జరిగింది. కారు పాదచారుల పైనుంచి దూసుకెళ్లడంతో ఏడుగురు మరణించగా పలువురు గాయాల పాలయ్యారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ఏడుగురి మృతికి కారణమైన కారు డ్రైవరును అదుపులోకి తీసుకున్నామని బ్రౌన్స్‌విల్లే పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన లెఫ్టినెంట్ మార్టిన్ సాండోవల్ చెప్పారు. వలసదారులు బస్సు కోసం బస్ స్టాప్ వద్ద వేచి ఉండగా వారిపై నుంచి కారు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవరు మద్యం మత్తులో ఉన్నాడా లేదా అనేది తెలుసుకోవడానికి పరీక్షలు చేస్తున్నామని సాండోవల్ చెప్పారు. కారు డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా ప్రజలపైకి దూసుకెళ్లాడా లేదా వాహనంపై నియంత్రణ కోల్పోయాడా అనేది స్పష్టంగా తెలియలేదని కామెరాన్ కౌంటీకి చెందిన న్యాయమూర్తి ఎడ్డీ ట్రెవినో జూనియర్ చెప్పారు. ఈ ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారనేది వివరాలు తెలియలేదు.