Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: రోబోటిక్స్ టెక్నాలజీపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫ్రేమ్‌వర్క్‌ను సోమవారం టీహబ్‌లో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. దీనికి ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ డైరెక్టర్ రమాదేవి హాజరుకానున్నారు. ఎప్పటికప్పుడు సమర్థవంతంగా అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీల్లో భాగంగా ప్రభుత్వం ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్‌ను ఏర్పాటుచేసింది. ఇందులో పది రకాల ఎమర్జింగ్ టెక్నాలజీలైన కృత్రిమ మేథ(ఏఐ), కౌడ్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, ఐవోటీ, మిషన్ లర్నింగ్, బిగ్ డాటా, బ్లాక్ చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్, 3డీ ప్రింటింగ్, అడిటివ్ మాన్యుఫాక్చరింగ్, స్పేస్ టెక్నాలజీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది.