Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమెరికా
అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగమ్మాయి మృతి చెందింది. టెక్సాస్‌లోని డాలస్‌కు ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలెన్ ప్రీమియర్ దుకాణ సముదాయంలో శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దుర్ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ కాల్పుల్లో తాటికొండ ఐశ్వర్య కూడా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఐశ్వర్య తండ్రి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పని చేస్తున్నారు.