Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ఈ నెల 9న నగరంలో అరుదైన సంఘటన ఆవిష్కృతం కాబోతున్నది. మంగళవారం మధ్యాహ్నం 12.12 గంటల నుంచి 12:14 అంటే రెండు నిమిషాల వ్యవధిలో నీడ మాయం కానుంది. ఆ రోజున సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని జీరో షాడో డేగా పిలుస్తారని తెలిపారు. ఎండలో నిటారుగా (90డిగ్రీల) ఉంచిన వస్తువుల నీడ రెండు నిమిషాల పాటు అంటే 12.12 గంటల నుంచి 12.14 గంటల వరకు కనిపించదని బిర్లా సైన్స్ సెంటర్ టెక్నికల్ అధికారులు పేర్కొన్నారు. ఇటువంటి అరుదైన సంఘటనను నగరవాసులు తప్పకుండా అనుభూతి చెందాలని సూచించారు. సూర్యకాంతిలో ప్రతి వస్తువుకు నీడ ఉంటుంది. కానీ అదే సూర్య కాంతిలో నీడ ఉండదనే అద్భుతం వెనక అనేక కారణాలు ఉన్నాయని వివరించారు. కాగా, ఇటీవల నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆ రోజు వాతావరణ పరిస్థితుల్లో తేడాలు ఏర్పడితే సూర్యుడు కనిపించకపోవడం వల్ల ఈ అద్భుతాన్ని చూసే అవకాశం ఉండదని పేర్కొన్నారు.