Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గోపాల్పూర్
దక్షిణ, తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఆవర్తనం సోమవారం ఉదయంలోగా అల్పపీడనంగా మారనుందని 9న ఇది తీవ్ర వాయుగుండం కానుందని గోపాల్పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్ దాస్ ఆదివారం సాయంత్రం ‘న్యూస్టుడే’కు చెప్పారు. 10న వాయుగుండం తుపానుగా మారనుండగా, దీనికి యెమన్ దేశం ‘మోచా’గా నామకరణం చేసింది. ఈ విపత్తు తీవ్ర రూపం దాలుస్తుందన్న అంచనా ఉందన్న దాస్ 9న ఉత్తర దిశగా కేంద్ర బంగాళాఖాతంలో ప్రవేశించి ఆ తరువాత ఏ దిశగా కదులుతుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదని, మంగళవారం పూర్తి వివరాలు చెప్పగలుగుతామన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఓడరేవులకు ఇంతవరకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదన్నారు. సముద్రంలో ట్రాలర్లు, మర బోట్ల ద్వారా చేపలు వేటకు వెళ్లిన మత్స్యకారులు 8 సాయంత్రం లోగా ఒడ్డుకు చేరుకోవాలని హెచ్చరించామని దాస్ చెప్పారు. మరోవైపు విదేశీ వాతావరణ అధ్యయన సంస్థలు తీవ్ర తుపానుగా మారనున్న మోచా మయన్మార్ వద్ద తీరం దాటొచ్చని ఒడిశాకు ముప్పు ఉండదని విశ్లేషించారు.