Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ, మరోసారి సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్, ఇద్దరిలో ఎవరికీ సరిపడా సీట్లు రాకుంటే కింగ్‌పిన్‌గా మారొచ్చని జేడీఎస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. తమ అభ్యర్థుల తరఫున ప్రధాని మోదీ, అమిత్ షా, మల్లికర్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సోనియా గాంధీ, కుమార స్వామి, దేవేగౌడ వంటి అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఉచిత హామీలతో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించారు.
20 రోజులుగా సాగుతున్న ఎన్నికల ప్రచార హోరు సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. మైక్సెట్లు, లౌడ్స్పీకర్లు ఇక మూగవోనున్నాయి. ర్యాలీలు, రోడ్ షోలకు తెరపడనుంచి. బుధవారం కన్నడ ఓట్లరు ఆయా పార్టీల అభ్యర్థుల తలరాతను నిర్ధేశించనున్నారు. 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10న ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వస్తాయి. ప్రజలు ఎలాంటి ఫలితం ఇస్తారనే విషయమై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నప్పటికీ.. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ మాత్రం అవినీతిమయమైన బీజేపీకి మరోసారి అధికారం దక్కదని తేల్చిచెప్పాయి. గతంలో పార్టీలను చీల్చిన అధికారం చేపట్టిన కాషాయ పార్టీ ఈ సారి ప్రతిపక్షానికే పరిమితమవనుందని అంచనావేశాయి.