Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలకు ముహూర్తం ఫిక్స్ చేసింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. జులై 9న సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు అధికారికంగా జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
జులై 10 న రంగం (భవిష్య వాణి) ఉంటుందని..చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఘనంగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాల విశిష్టతను మరింత పెంచింది కెసిఆర్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాలు, బతుకమ్మ వేడుకలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.