Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరువనంతపురం: కేరళలోని తన్నూర్ ప్రాంతంలోని తూవలతీరం బీచ్ వద్ద బోటు బోల్తాపడిన ఘటనలో 22 మంది మృతిచెందారు. ఆదివారం రాత్రి జరిగిన ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను సీఎం పినరయి విజయన్ ఇవాళ కలిశారు. ఈ ఘటన పట్ల ఆయన జుడిషియల్ విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఆయన ప్రకటించారు. తిరురంగాండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బోటు ప్రమాద బాధితులను ఇవాళ ఆయన కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదం ఓ విషాదం అన్నారు. చికిత్స పొందుతున్న వారి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టేందుకు నిపుణులతో కూడిన జుడిషియల్ కమీషన్ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు.
ప్రధాని మోడీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు 2 లక్షలు ఇ్వవ్వనున్నట్లు తెలిపారు. కేరళలో ఇవాళ సంతాప దినం పాటిస్తున్నారు. అధికారిక ఈవెంట్లను రద్దు చేశారు. బోటు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మంది మృతిచెందారు. ఆ కుటుంబాన్ని కూడా ఇవాళ సీఎం విజయన్ పరామర్శించారు.