Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మణిపూర్ లో నెలకొన్న శాంతిభద్రతల సమస్యతో అక్కడ ఉన్న విద్యార్థులు, నివసిస్తున్న ప్రజల భద్రతకు తెలుగువారి తరలింపు ప్రక్రియను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా విమానాలను ఏర్పాటు చేశాయి. మణిపూర్ లో తెలుగు ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రత్యేక సెల్ తెరిచారు.
ఈ క్రమంలోనే అక్కడినుండి తెలుగు విద్యార్థులతో కూడిన తొలి ఫ్లైట్ ఈరోజు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ ఫ్లైట్ లో మణిపూర్ లో చిక్కుకున్న 161 మంది విద్యార్థులను అధికారులు తీసుకువచ్చారు. విద్యార్థులను స్వగ్రామాలకు తరలించేందుకు ఎయిర్పోర్టులో 15 బస్సులను సిద్ధంగా ఉంచారు. ఇందులో ఏపీకి 7, తెలంగాణలోని పలు ప్రాంతాలకు 8 బస్సులు వెళ్ళనున్నాయి. తల్లిదండ్రులు ఎయిర్ పోర్టుకి రానవసరం లేదని అధికారులు తెలిపారు.