Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సినీ గాయని రక్షిత సురేశ్ మలేషియాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ఇండియాకు తిరిగి వచ్చేందుకు ఎయిర్ పోర్టుకు వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 'పెద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాను. ఇండియాకు తిరిగి వచ్చేందుకు ఎయిర్ పోర్టుకు వస్తుండగా నేను ఉన్న కారు డివైడర్ ను ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఆ 10 సెకన్ల సమయంలో నా మొత్తం జీవితం కళ్ల ముందు కనిపించింది. ఎయిర్ బ్యాగ్స్ లేకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేది. నాకు, డ్రైవర్ కు, ఫ్రంట్ సీట్లో కూర్చున్న మరొక వ్యక్తికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. బతికే ఉన్నందుకు సంతోషంగా ఉంది' అని రక్షిత తన భయానక అనుభవం గురించి వెల్లడించారు. కర్ణాటకకు చెందిన రక్షిత పలు తెలుగు చిత్రాల్లో కూడా పాటలు పాడారు.