Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా లాభపడ్డాయి. ఈ ఉదయం పాజిటివ్ గా ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో పాటు, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపడం మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 710 పాయింట్లు లాభపడి 61,764కి ఎగబాకింది. నిఫ్టీ 195 పాయింట్లు పుంజుకుని 18,264కి చేరుకుంది.