Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో జరిగిన కాల్పుల సంఘటనలో హైదరాబాద్ సరూర్ నగర్ కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి అనే యువతి ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించారు. హైదరాబాదుకు చెందిన 27 ఏళ్ల తాటికొండ ఐశ్వర్య అమెరికాలోని అలెన్ లో జరిగిన కాల్పుల్లో మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు. ప్రస్తుతం ఐశ్వర్య కుటుంబం పరిస్థితి తలుచుకుంటే గుండె తరుక్కుపోతోందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకునేలా ఐశ్వర్య కుటుంబానికి దేవుడు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు. టెక్సాస్ లోని ఓ షాపింగ్ మాల్ లో కాల్పుల ఘటన జరగ్గా, ఎనిమిది మంది మరణించారు. చనిపోయిన వారిలో ఐశ్వర్య రెడ్డి కూడా ఉన్నారు. ఆమె గత ఐదేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు.