Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతుంది. ప్రస్తుతం వాట్సాప్ ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉంది. కొత్త ఫీచర్‌ను 'అడ్మిన్ రివ్యూ' పేరుతో తీసుకురానుంది.
అయితే ఈ ఫీచర్ అందరికీ కాదు. కేవలం వాట్రాప్ గ్రూపు అడ్మిన్లు మాత్రమే ఉపయోగించేలా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ వల్ల వాట్సాప్ గ్రూపులలో సభ్యులకు ఇబ్బందులు కలిగించే మెసేజ్‌లను గ్రూప్ అడ్మిన్లు డిలీట్ చేయవచ్చు. ఎలా అంటే సాధారణంగా వాట్సాప్ గ్రూపుల్లో చాలా పెద్ద మొత్తంలో సమాచారం వచ్చి చేరుతుంటుంది. ఈ సమాచారం గ్రూపులో ఉన్న సభ్యులకు ఇబ్బందికరంగా అనిపించినా, ఒకవేళ ఆ సమాచారం తప్పుడు ఇన్ఫర్మేషన్ అని అనిపించినా సంబంధిత సమాచారం గురించి వాట్సాప్ గ్రూపు సభ్యులు డైరెక్ట్‌గా గ్రూపు అడ్మిన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. అప్పుడు ఆ మెసేజ్‌ను గ్రూపు నుంచి ఎవరికి కనిపించకుండా డిలీట్ చేసే అవకాశం గ్రూప్ అడ్మిన్‌కు ఉంటుంది. ఎవరైతే గ్రూపు సభ్యులు ఫిర్యాదు చేస్తారో వారి సమాచారం గ్రూపు అడ్మిన్‌కు మాత్రమే కనిపిస్తుంది. ప్రయోగదశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం తీసుకురానున్నారు. ఈ కొత్త సదుపాయం వల్ల గ్రూపుల్లో షేర్ అయ్యే తప్పుడు సమాచారాన్ని నిరోధించడం సులభమవుతుంది. అంతేకాకుండా గ్రూపు సభ్యులకు ఇబ్బంది కలిగించే సమాచారాన్ని సైతం తగ్గించవచ్చు.