Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ (వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు)కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో నిరాశ ఎదురైంది. రాఘవ బెయిల్ పిటిషన్ పై కోర్టు నేడు విచారణ చేపట్టింది. రాఘవకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఆయన బెయిల్ పిటిషన్ ను న్యాయమూర్తి కొట్టివేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న మాగుంట రాఘవ ఫిబ్రవరి 11న అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ ప్రముఖంగా వ్యవహరించిందని చెబుతోన్న ఈడీ... సౌత్ గ్రూప్ లో మాగుంట రాఘవ కీలకంగా వ్యవహరించాడని నిర్ధారించింది.