Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఈటో మొబిలిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో కాచిగూడ రైల్వే స్టేషన్లో సోమవారం ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటో మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పవన్ చావలి మాట్లాడుతూ పట్టణ రవాణాను మార్చాలనే దృఢమైన నిబద్ధతతో ఈటో మోటార్స్ సౌత్‌తో భాగస్వామ్యంతో హైదరాబాద్‌లోని కాచిగూడ స్టేషన్లో 15 ఈ - ఆటోలను ప్రారంభించామన్నారు. ఈటో మోటార్స్ దక్షిణ మధ్య రైల్వే సహకారంతో ఇతర స్టేషన్లలో తన ఈవీ వాహనాలను విస్తరించే ప్రక్రియలో ఉందన్నారు. హైదరాబాద్‌లో 500 ఈ-ఆటోలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నగరంలో ఇప్పటికే 120 ఈ-ఆటోలు నడుస్తున్నాయన్నారు.
ఈ ఎలక్ట్రిక్ ఆటోలు అత్యాధునిక భద్రతా లక్షణాలను కలిగి ఉంటాయన్నారు. ప్రయాణీకులు, డ్రైవర్ల భద్రతకు భరోసా ఇచ్చే లాట్ సాంకేతికతను కలిగి ఉన్నాయన్నారు. ఈటో మోటార్స్ మెట్రో స్టేషన్లో వారి యాజమాన్య ఛార్జింగ్ సొల్యూషన్ - థండర్బాక్స్ ద్వారా ఆధారితమైన ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిందన్నారు. ఈ అత్యాధునిక ఛార్జింగ్ నెట్వర్క్ ఒకేసారి 30 ఎలక్ట్రిక్ వాహనాల వరకు ఛార్జ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. మా ఎలక్ట్రిక్ వాహనాలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ద్వారా హరిత విప్లవంలో ప్రధాన భాగమైనందుకు ఎంతో గర్విస్తున్నామన్నారు.