Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ 16వ సీజన్ 53వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ప్లే ఆఫ్ రేసు దగ్గర పడడంతో ఇరుజట్లు విజయంపై కన్నేశాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ 7వ, కోల్‌కతా 8వ స్థానంలో ఉన్నాయి. దీంతో, ఈ మ్యాచ్ ఇద్దరికీ కీలకం కానుంది. హైదరాబాద్‌పై గెలిచిన కోల్‌కతా సొంత గడ్డపై జోరు కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో కంగుతిన్న శిఖర్ ధావన్ సేన గెలుపు కోసం పోరాడనుంది. ఇరు జట్లు ఎదురుపడిన తొలి రౌండ్లో కోల్‌కతాపై ఆఖరి ఓవర్లో పంజాబ్ గెలిచింది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ వేయగా పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. దీంతో శిఖర్ దావాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మరి ఈసారి విజయం ఎవరిని వరిస్తుందో మరికొన్ని గంటల్లో తెలుస్తుంది.