Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం తెరపడింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులు పోటాపోటీగా ప్రచారం సాగించారు. ఈ ప్రచార అంకానికి నేడు తెరపడింది. నెల రోజులకు పైగా వివిధ ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలు నిర్వహించారు. ఎల్లుండి ఓటింగ్ నేపథ్యంలో మైకులు మూగబోయాయి. బుధవారం పోలింగ్ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం, రేపు ప్రలోభాలకు తెరలేపే అవకాశాలు ఉంటాయి. కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మే 10వ తేదీన పోలింగ్ జరగనుంది. 13వ తారీఖున ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో 918 మంది స్వతంత్రులతో కలిపి 2613 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రతిసారి రెండో పార్టీకి పట్టం గట్టే కన్నడ ప్రజలు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే ఆసక్తి అందరిలోను నెలకొంది.