Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మహిళలకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టీ-24 టిక్కెట్ ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సామాజిక అనుసంధాన వేదిక ద్వారా వెల్లడించారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ.100 ఉన్న టీ-24 టిక్కెట్ ధరను సాధారణ ప్రయాణీకులకు రూ.90, సీనియర్ సిటిజన్లకు రూ.80కి అందించాలని నిర్ణయించారు. తాజాగా మహిళలకు రూ.10 తగ్గించి రూ.80కే ఇవ్వనున్నారు. ఇది మంగళవారం నుండి అందుబాటులోకి వస్తోంది.