Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భారీగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీన భారత్‌కు చెందిన మహిళా ప్రయాణికురాలు మాలావి నుంచి దోహా మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన వెంటనే తనిఖీ చేయగా.. ఆమె తీసుకొచ్చిన సూట్‌కేసులో 5.90 కిలోల క్రీం రూపంలో ఉన్న తెల్లటి పౌడర్‌ను డీఆర్ఐ అధికారులు గుర్తించారు. నార్కోటిక్స్ ఫీల్డ్ టెస్టింగ్ కిట్స్ ద్వారా పరిశీలించడంతో అది హెరాయిన్ అని అధికారులు తేల్చారు. బాహిరంగ మార్కెట్లో దాని విలువ దాదాపు రూ.41.30 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
భారతీయురాలైన సదరు మహిళ, మాలావి నుంచి హెరాయిన్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు డీఆఆర్‌ఐ అధికారులు గుర్తించారు. నిందితురాలిని డీఆర్ఐ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ హెరాయిన్‌ను ఎక్కడ, ఎవరికి చేరవేయాలనుకున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. హెరాయిన్ చేరవేస్తే కొంత డబ్బు ఇచ్చేలా మహిళతో ఒప్పందం కుదుర్చుకొని.. శంషాబాద్ విమానాశ్రయంలో నిర్దేశించిన ప్రాంతానికి తీసుకెళ్లాలని సూచించినట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో హెరాయిన్‌ను తీసుకునే వాళ్ల వివరాలు సైతం నిందితురాలికి తెలియవని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.