Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెజవాడ
బెజవాడలో దారుణం చోటు చేసుకుంది.ఇయర్ ఫోన్ విషయంలో ఓ యువకున్ని చంపారు అతని స్నేహితులు. గంజాయి మత్తులో హత్య చేసినట్టు భావిస్తున్నారు పోలీసులు. హత్యకు గురైన వ్యక్తి అజయ్ సాయిగా గుర్తించారు పోలీసులు. నిందితులు నాగార్జున, మణికంఠ, ప్రశాంత్ గా గుర్తించారు. ఇయర్ బర్డ్స్ విషయంలో వివాదం తలెట్టంతో అజయ్ పై మిగతా ముగ్గురు తీవ్ర దాడికి దిగారు. కంకిపాడులో రోడ్డు ప్రమాదం జరిగినట్టు ఆసుపత్రిలో చేర్చినట్లు డ్రామా ఆడారు నిందితులు. ఆ ప్రమాదం వల్ల తగిలిన దెబ్బలు కాదని దాడి చేస్తే, తగిలిన దెబ్బలు గా నిర్ధారించి పోలీసులకు చెప్పారు వైద్యులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.