Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈఏపీసెట్ పరీక్షల హాల్‌టికెట్లు మంగళవారం నుంచి అందుబాటులో ఉంటాయని ఏపీఈఏపీసెట్ ఛైర్మన్ రంగ జనార్దన, కన్వీనర్ శోభాబిందు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఏపీఈఏపీసెట్-2023 వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. 2023 - ఈఏపీసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు రాగా.. వీటిలో ఇంజినీరింగ్ విభాగానికి 2,37,055, వ్యవసాయ, ఔషధ విభాగాలకు 99,388, రెండు విభాగాలకు 979 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ఈ నెల 15 నుంచి 19 వరకు జరుగుతాయని, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22, 23 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. ఏమైనా సందేహాలుంటే 08554-23411, 232248 ఫోను నంబర్ల ద్వారా సహాయ కేంద్రాన్ని సంప్రదించాలన్నారు.