Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
చికోటి ప్రవీణ్ కు మరోసారి ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. క్యాసినో కేస్ లో గతంలోనూ చికోటి ప్రవీణ్ ను విచారించిన ఈడి.. ఇవాళ మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇటీవల థాయిలాండ్ ఘటన తరువాత మరోసారి చికోటికి ఈడి నోటీసులు జారీ చేసింది. చికోటి తో పాటు చిట్టి దేవేందర్, సంపత్, మాధవ రెడ్డి లకు సైతం ఈడి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈడి విచారణ కు హాజరయ్యాడు సంపత్. ఇక మిగతా ముగ్గురిని తమ ముందు హాజరు కావాల్సింది గా ఈడి నోటీసులు జారీ చేసింది. థాయిలాండ్ నుంచి శుక్రవారం హైదరాబాద్ కు రానున్నారు చికోటి ప్రవీణ్. వచ్చే వారం ఈడి ముందుకు చికోటి ప్రవీణ్ వెళ్లనున్నాడు. ఈ సందర్భంగా చికోటి ప్రవీణ్ ఎలాంటి ప్రశ్నలు ఆడుగుతారోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.