Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై
స్ధానిక వాషర్‌మెన్‌పేటలో ఛార్జింగ్‌లో ఉన్న సెల్ఫోన్లో మాట్లాడిన యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందడంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాషర్‌మెన్‌పేట కెనాల్ వీధికి చెందిన కామరాజ్ (22) టీ మాస్టర్‌గా పనిచేస్తూ అద్దె ఇంట్లో నివస్తున్నారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ఛార్జింగ్‌లో ఉన్న సెల్ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో హఠాత్తుగా షాక్‌కు గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.