Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై
ఉత్తర చెన్నైలో పేరుమోసిన రౌడీలు ఈషా, ఎలి యువరాజ్‌ను నగర పోలీసులు అరెస్టు చేశారు. రెండేళ్లుగా పరారీలో ఉన్న వీరిరువురు బెంగళూరులో దాగి వున్నట్లు రహస్య సమాచారం అందటంతో ప్రత్యేక దళం పోలీసులు ఆ నగరానికి వెళ్ళి సోమవారం వేకువజాము ఇరువురిని నిర్బంధించారు. పోలీసులు చుట్టుముట్టారని తెలుసుకుని పారిపోయేందుకు ఇరువురూ ప్రయత్నించారు. దీనితో అప్రమత్తమైన పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి హెచ్చరికలు జారీ చేసి ఇరువురిని నిర్బంధించారు. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం ఆ ఇద్దరు రౌడీలు నేలపై పడటంతో ఇరువురి కాళ్ళకు తీవ్రమైన గాయాలు తగిలాయి. ఆసుపత్రిలో ఇరువురికి చికిత్సలు చేసి పోలీసులు నగరానికి తీసుకువచ్చారు.