Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు: కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో హనుమాన్ చాలీసా పఠనంపై నిషేధం విధించింది. బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీకి నిరసనగా మంగళవారం బెంగళూరులో బీజేపీ హనుమాన్ చాలీసా పఠిస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో సీఆర్ పీసీ 144 సెక్షన్ విధించినందున వీహెచ్‌పీ సభ్యులు హనుమాన్ చాలీసా పఠించకుండా ఈసీ ఆపింది. విజయనగర్‌లోని ఒక ఆలయం వెలుపల ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడేందుకు అనుమతి లేదని ఎన్నికల సంఘం అధికారులు వీహెచ్‌పీ సభ్యులను కోరారు. వీహెచ్‌పీ సభ్యులు తమ కార్యక్రమాన్ని కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.