Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మరో వార్తను వినిపించారు. గతేడాది ట్విట్టర్ ను కొనుగోలు చేసింది మొదలు, తరచూ ఏదో ఒక పని చేస్తూ ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. 60 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. బ్లూటిక్ పేరుతో చందాను తీసుకొచ్చారు. భారత్ సహా చాలా దేశాల్లో కార్యాలయాలను కుదించుకున్నారు. ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ ఖాతాల ప్రక్షాళనకు పూనుకున్నారు. ఇదే విషయాన్ని ఎలాన్ మస్క్ స్వయంగా ట్విట్టర్లో ప్రకటించారు. ట్విట్టర్ ఖాతాను తెరిచి కొన్నేళ్లుగా దానిని వాడకుండా వదిలేసిన వారు ఓ సారి మేల్కోవాల్సిందే. అలాంటి ఖాతాలను తొలగించనున్నట్టు మస్క్ తెలిపారు. దీనివల్ల ఫాలోవర్ల సంఖ్యపై ప్రభావం పడుతుందన్నారు. ఎందుకంటే మీ ఫాలోవర్లలో యాక్టివ్ గా లేని ఖాతాలన్నీ కనుమరుగు అవుతాయని, దాంతో ఫాలోవర్ల సంఖ్య తగ్గుతుందని మస్క్ వివరించారు. దీనిపై ఓ యూజర్ సీరియస్ గా స్పందించారు. ఈ చర్య ఘోర తప్పిదం అవుతుందని హెచ్చరించారు. యాక్టివ్ గా లేని ఖాతాల్లో ఎప్పటి నుంచో ఉన్న ట్వీట్లు కూడా డిలీట్ అయిపోతాయన్నారు. దీన్ని తప్పనిసరిగా పునరాలోచించాలని కోరారు.