Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ గురించి ఇటీవల తరచూ వింటున్నాం. క్రికెటర్లు, విశ్లేషకులు, అభిమానుల్లో ఇదో ముఖ్యమైన అంశంగా మారిపోయింది. దీంతో ఎవరికి వారు తమకు తోచినట్టు ధోనీ రిటైర్మెంట్ కు భాష్యం చెబుతున్నారు. తాజాగా ధోనీ స్నేహితుడు, చెన్నై జట్టుకు సుదీర్ఘకాలం పాటు ఆడిన సురేష్ రైనా కీలక విషయాన్ని బయటపెట్టాడు. ఈ నెల 6న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సీఎస్కే, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇది ముగిసిన తర్వాత సురేష్ రైనా అక్కడ ఎల్లో జెర్సీలో కనిపించాడు. ధోనీ, రైనా ఒకరిపై ఒకరు చేయి వేసుకుని నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించింది.
టీమిండియాలోనూ ధోనీ సహచరుడిగా రైనా చాలా ఏళ్లు సేవలు అందించాడు. జియో సినిమా ఛానల్ లో ఐపీఎల్ వ్యాఖ్యాతగా సేవలు అందిస్తున్నాడు. ధోనీతో తన చివరి భేటీ గురించి కూడా చెప్పాడు. ‘‘ట్రోఫీని గెలుచుకున్న తర్వాత నేను మరో ఏడాది పాటు ఆడతాను’’అని ధోనీ తనతో చెప్పినట్టు రైనా తాజాగా జియో సినిమాకి వెల్లడించాడు. సీఎస్కే కెప్టెన్ ఐపీఎల్ వ్యూహం గురించి, ఐదో టైటిల్ గెలుచుకునే విషయంలో అతడి నమ్మకాన్ని ప్రస్తావించాడు. ‘‘అతడు చూడ్డానికి ఫిట్ గా ఉన్నాడు, బాగా ఆడుతున్నాడు. ఐపీఎల్ లేదా భారత క్రికెట్ కు ఆడడాన్ని అతడు కొనసాగించాలి. ప్రతీ మ్యాచ్ తర్వాత ధోనీ పాఠశాల ఎంతో ముఖ్యమైనది. ఎంతో మంది ఆటగాళ్లు అతడి నుంచి నేర్చుకుంటున్నారు. రిటైర్మెంట్ అనేది అతడు తీసుకోవాల్సిన నిర్ణయం’’అని రైనా వివరించాడు.