Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ఈ నెల 10 నుంచి 14 వరకు జరిగే టీఎస్ ఎంసెట్ పరీక్షలకు అభ్యర్థులు తమ ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును చూపిస్తేనే అనుమతిస్తామని ఎంసెట్ కన్వీనర్ డీన్‌కుమార్, కోకన్వీనర్ విజయ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. కాలేజీ ఐడీ కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒక ఒరిజినల్ కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. జిరాక్స్, స్కాన్డ్ కాపీ చూపిస్తే అనుమతించబోమని తెలిపారు. ఈ నెల 10, 11న అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగాల వారికి, 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని పేర్కొన్నారు. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు జేఎన్టీయూ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు.
మొదటి సెషన్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. తెలంగాణలో 104, ఏపీలో 33 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలిసారిగా పరీక్షలకు రాష్ట్రంలో 132 అబ్జర్వర్లను నియమించారు. ఒక్క హైదరాబాద్‌లోనే 84 మంది అబ్జర్వర్లు విధులు నిర్వరిస్తారు. ఉదయం సెషన్లో 7:30 గంటల నుంచి, మధ్యాహ్నం సెషన్లో 1:30 గంటల నుంచే పరీక్షాకేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు.