Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సోమవారం ప్రభాస్ ఫ్యాన్స్ కోసం స్పెషల్‌గా ఏఎమ్‌బీ మాల్లో 'ఆదిపురుష్' ట్రైలర్‌ను స్ట్రీమింగ్ చేశారు. ట్రైలర్‌ను చూసిన వారందరూ ఆహా.. ఓహో అంటూ ఎత్తేస్తున్నారు. టీజర్‌కు వంద రెట్లు ట్రైలర్ మెరుగ్గా ఉందని, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ప్రేక్షకుల్లో ట్రైలర్‌పై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ట్రైలర్ చూద్దామా? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇక తాజాగా మేకర్స్ యూట్యూబ్‌లో ఆదిపురుష్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సీతను రావణుడు అపహరించడంతో మొదలుపెట్టి రాముడి ఆగమనం, ఆయోధ్య పరిచయం ఇలా కొనసాగించి చివరికి రామ, రావణ యుద్ధం షాట్లతో ట్రైలర్‌ను ముగించారు. ఎట్టకేలకు ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే టైమ్ వచ్చింది. ట్రైలర్ మాత్రం రచ్చ లేపింది. టీజర్‌తో వచ్చిన నెగెటివిటీ అంతా ట్రైలర్‌తో పటాపంచలయింది. విజువల్స్ వేరే లెవల్లో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. డైలాగ్స్ అయితే గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక ట్రైలర్‌తో సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి.