Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మంత్రి తలసాని.. మనిషిగా మాట్లాడుతున్నారో.. పశుసంవర్ధక శాఖ మంత్రి లెక్క మాట్లాడుతున్నారో అర్థం కాలేదన్నారు. రేవంత్ ని పిసికేస్తా.. పొట్టోడు అని అంటున్నాడని.. ముందు సికింద్రాబాద్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకుంటే నువ్వు మంత్రివి అయ్యేవాడివా అని ప్రశ్నించారు. తలసాని ఏమైనా టిఆర్ఎస్ లో పుట్టాడా అని నిలదీశారు. ప్రియాంక గాంధీౌ మా ఇంట్లో నానమ్మ.. నాన్న దేశం కోసం చనిపోయారు అన్నారని.. మరి మీ ఇంట్లో తెలంగాణ కోసం ఎవరైనా చనిపోయారా..? అని ప్రశ్నించారు. శ్రీకాంతాచారి చనిపోవడానికి నీలాంటి వాళ్ళు కారణం కాదా.? అన్నారు సునీతారావు. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ ని ఏమన్నావో గుర్తుందా? అని నిలదీశారు.