Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ముంబయి ఇండియన్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్-16 సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆర్చర్ ఇంకా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో తన స్వదేశానికి పయనమయ్యాడు. అతడి స్థానంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ జోర్డాన్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు ముంబయి ఇండియన్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. క్రిస్ జోర్డాన్‌తో ముంబయి రూ. 2 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ సీజన్లో ఆర్చర్ ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. 5 మ్యాచ్‌లు ఆడి 9.50 ఎకానమీతో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.