Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు లీజుకు ఇచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మంగళవారం ప్రశ్నించారు. ఈ లీజు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పారు. కొత్తగా నిర్మించిన సచివాలయానికి ప్రతిపక్షాలను ఎందుకు రానివ్వడం లేదో చెప్పాలని కూనంనేని నిలదీశారు. హుస్నాబాద్, మునుగోడు, కొత్తగూడెం, బెల్లంపల్లి, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాలపై తాము ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.