Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్‌లో సంతకాల సేకరణ చేపట్టారు. హిమాయత్‌నగర్ లోని మఖ్ధుం భవన్లో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతకాల సేకరణలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొని సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ఎన్నో పతకాలను సాధించి, గౌరవాన్ని పెంచిన మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిచ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాలుగు నెలల నుంచి మహిళా రెజ్లర్లు ఢిల్లీలో శాంతియుతంగా పోరాటం సాగిస్తున్నప్పటికీ కేంద్రం స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జిచే సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎఫ్ఐడబ్ల్యూ సీనియర్ నాయకురాలు పశ్యపద్మ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.జ్యోతి, సహాయ కార్యదర్శి ఎం.నళిని,నాయకురాలు లతాదేవి,ఫమిదా, సుగుణమ్మ, జంగమ్మ, లక్ష్మికుమారి పాల్గొన్నారు.