Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత వాయుసేనలో అగ్నివీరులుగా చేరేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్. అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్వాయు పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మే 20 నుంచి రాత పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు తమ యూజర్ నేమ్ లేదా ఈ-మెయిల్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేసి అడ్మిట్ కార్డును పొందొచ్చు. ఫేజ్-1(ఆన్లైన్ రాత పరీక్ష), ఫేజ్-2 (ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక పూర్తి చేయనున్నారు. వాయుసేనలో అగ్నివీర్-వాయు ఉద్యోగాలకు మార్చి 17 నుంచి 31 వరకు దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే.