Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: తనతో స్నేహం వద్దని హిజ్రా చెప్పినందుకు ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్సై అజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ టప్పచబుత్ర ప్రాంతానికి చెందిన మహ్మద్ అజార్(25) ఆటో డ్రైవర్. అదే ప్రాంతానికి చెందిన ఓ హిజ్రా(25)తో గత 9 నెలలుగా స్నేహం చేస్తున్నాడు. అయితే హిజ్రా గత నాలుగు రోజుల కిందట పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జల్పల్లిలో గదిని అద్దెకు తీసుకుంది.
ఈ విషయం తెలుసుకున్న మహ్మద్ అజార్ 8న జల్పల్లికి వచ్చాడు. రాత్రి 10 గంటలకు హిజ్రాతో కలిసి బయటకు వెళ్లి 9న తెల్లవారు జామున 4:30 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి చేరుకున్నారు. అనంతరం హిజ్రా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అజార్‌ను ఆదేశించింది. ఆ విషయంతో ఇద్దరి మధ్యన గొడవ జరిగింది. హిజ్రా ఆటోలో ఉండగానే అజార్ ఇంట్లోకి వెళ్లి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి అన్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉన్నది.