Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసులు వివిధ కారణాలతో స్వాధీనం చేసుకున్న వాహనాలలో క్లెయిమ్ చేయని 820 వాహనాలు మెహినాబాద్ పీఎస్ గ్రౌండ్లో ఉన్నాయని, వాటిని బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించామని పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఆ వాహనాల వివరాలు www.cyberabadpolice.gov.in వెబ్సైట్లో పొందుపరిచామని, వేలానికి అభ్యంతరం చెప్పే వాళ్లు తమ వద్ద ఉన్న వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లతో ఆరు నెలల్లోపు సంబంధిత ఎస్హెచ్ఓను సంప్రదించాలని సీపీ సూచించారు. ఈ వాహనాలకు సంబంధించి సమాచారం కోసం 9490517317 నంబర్లో సంప్రదించాలని సీపీ సూచించారు.