Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమల
కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం 10 గంటల్లో కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 65,237 మంది భక్తులు దర్శించుకోగా 22,926 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.50 కోట్లు వచ్చిందని వివరించారు.