Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: టీఎస్ ఎంసెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 10 నుంచి 14 వరకు జరిగే పరీక్షల నిర్వహణకు జేఎన్టీయూ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్లో పరీక్షలు జరుగుతాయి. తొలిరోజు పేపర్ కోడ్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి హైదరాబాద్ కూకట్పల్లిలోని జేఎన్టీయూలో విడుదల చేస్తారు. ఒక్కోసెషన్కు ఫార్మసీ కోర్సుల్లో 28 వేల మంది విద్యార్థులు హాజరుకానుండగా, ఇంజినీరింగ్లో 34వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.